నగరంలో ఆధునికీకరించిన ఆనం కళా కేంద్రం శనివారం ప్రారంభించారు. - కొత్త జిల్లా ఏర్పాటు నేపథ్యములో ముందస్తుగా నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో రూ.2.1 కోట్ల నిధులతో పునఃనిర్మాణం చేపట్టారు.
ప్రారంభోత్సవ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మాధవీలత, ఎంపీ మార్గాని భరత్. రుడా ఛైర్మన్ షర్మిలారెడ్డి, కమిషనర్ దినేష్కు మార్ హాజరయ్యారు. ముందుగా కళా కేంద్రం ముందు శిలా ఫలకం ఆవిష్కరించగా, ప్రధాన హాలను కలెక్టర్ ప్రారంభించారు.