Ad Code

రాజమండ్రిలో గాలి వాన బీభత్సం

రాజమండ్రి అర్బన్, రూరల్ పరిధిలోని పలు ప్రాంతాల్లో గురువారం సాయంత్రం ఆకస్మికంగా గాలిదుమ్ము, వాన బీభత్సం సృష్టించాయి. ధవళేశ్వరం, రాజవోలు, వేంకటేశ్వరనగర్‌, నారాయణపురం తదితర ప్రాంతాల్లో చెట్లు పడిపోయాయి. సుమారు గంట సమయం పెద్ద గాలి దుమారం దాడి చేసి బీభత్సం సృష్టించడంతో అంతా అతలాకుతలం అయిపోయింది. కాగా వర్షం కూడా భారీగా పడడంతో పల్లపు ప్రాంతాలు జలమయం అయ్యాయి.